భారతదేశం, ఆగస్టు 15 -- ముంబై: భారత సెక్యూరిటీల మార్కెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న రెండు డిపాజిటరీ సంస్థలు... నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL), సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (CDSL). వీటిలో ఎన్‌ఎస్‌డీఎల్ ఇటీవల ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్‌లో అడుగుపెట్టడంతో పోటీ మరింత తీవ్రంగా మారింది. మరి ఈ రెండు సంస్థల్లో ఏ షేర్లను కొనుగోలు చేస్తే లాభాలుంటాయో నిపుణుల అభిప్రాయాలు, కంపెనీల తాజా ఆర్థిక ఫలితాలను ఇక్కడ విశ్లేషిద్దాం.

జూలై 2025లో ఎన్‌ఎస్‌డీఎల్ తన ఐపీఓను Rs.760 నుంచి Rs.800 ధరల మధ్య విజయవంతంగా పూర్తి చేసింది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఐపీఓ పూర్తిగా సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత, షేర్ ధర కేవలం కొద్ది రోజుల్లోనే ఇష్యూ ధర కంటే దాదాపు 80% పెరిగి Rs.1,425 దాటింది. ఇది పెట్టుబడిదారులను ఆశ్చర్యపరిచి...