Telangana,hyderabad, జూలై 9 -- నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌, హైదరాబాద్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్‌ మేనేజర్‌, అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 17 ఖాళీలు ఉన్నాయి. ఫైనాన్స్ విభాగంలో ఈ పోస్టులు ఉన్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు జూలై 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూనియర్‌ మేనేజర్‌ ఉద్యోగాలు 10 ఉండగా. అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఖాళీలు 7 ఉన్నాయి. https://www.nmdc.co.in/careers వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....