భారతదేశం, జనవరి 27 -- ప్రముఖ టూ వీలర్ కంపెనీ డుకాటీ కొత్త పానిగేల్ వి4 బైక్‌ను సోషల్ మీడియాలో టీజ్ చేసింది. ఈ సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిల్ త్వరలో భారతదేశంలో లాంచ్ అవుతుందని సూచిస్తుంది. జెన్ 7, ఎన్ రూట్ అనే శీర్షికతో ఈ బైక్ కొత్త డిజైన్, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో అందించనున్నారు. 2025 డుకాటీ పానిగేల్ వి4 అప్డేట్స్, ఫీచర్లను చూద్దాం.

కొత్త పానిగేల్ వి4 బైక్‌లో డిజైన్ పూర్తిగా అప్‌డేట్ చేశారు. హెడ్ లైట్లు మునుపటి కంటే ఇప్పుడు సన్నగా, మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. టెయిల్ లైట్లకు రెండు యూ ఆకారంలో ఉన్న ఎల్ఈడీ స్ట్రిప్స్‌ను జోడించారు. కొత్త డిజైన్ ఫెయిర్, రీపోజిషన్డ్ వింగ్‌లెట్లు అందించారు. చాలా కాలం తర్వాత డుకాటీ ఇందులో డబుల్ సైడ్ స్వింగ్ ఆర్మ్‌ను చేర్చింది. ఈ కొత్త సెటప్ 2.7 కిలోల తేలికైనది.

2025 పానిగేల్ వి4 1,103సీసీ డెస్మోసెడిసి స్ట్రాడేల...