భారతదేశం, జూన్ 17 -- ివిల్ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై తెలంగాణ హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో పోలీసులపై దాఖలైన 30 పిటిషన్లలో 25 పిటిషన్లు సివిల్ వివాదాల్లో జోక్యానికి సంబంధించినవని కోర్టు తెలిపింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ పోలీసు అధికారులు తమ విధానాన్ని ఎందుకు మార్చుకోలేదో చెప్పాలని ప్రశ్నించింది.

పోలీసులే అన్ని పనులు చేయాలనుకుంటే కోర్టులపై ఎలాంటి భారం ఉండదని జస్టిస్ టి. వినోద్ కుమార్ వ్యంగ్యంగా అన్నారు. 'దయచేసి మీ సౌలభ్యం ప్రకారం చట్టాలు, నియమాలను సవరించండి. అన్ని పనులు చేయండి.' అని అన్నారు.

రాబోయే శాసనసభ సమావేశాల్లో ఇళ్లు ఖాళీ చేయడం, అద్దె నియంత్రణ చట్టం కింద ఆస్తిని తొలగించడం, భూములను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించడం, వీలునామా పత్రాలు, గిఫ్ట్ డీడ్‌లను అమలు చేయడం వంటి అన్ని బాధ్యతలను పోలీసులకు...