Hyderabad, ఏప్రిల్ 18 -- ఎప్పుడూ ఎలన్ మస్క్, బిల్ గేట్స్ వంటి వారి గురించే చెబితే ఎలా? మనలో ఒకడిగా ఉండి, పేదరికంలో పుట్టి అనుకున్న విజయాన్ని సాధించిన ఒక సామాన్యుడి విజయగాథ ఇప్పుడు చెప్పుకుందాం. ఇతడు మనలాంటి వ్యక్తే. ఓటమితోనే స్నేహం చేసిన యువకుడు. కానీ ఓటమి ఆయన విజయాన్ని ఆపలేకపోయింది.

గవర్నమెంట్ ఉద్యోగమే లక్ష్యంగా పెట్టుకునే వారు ఎంతోమంది. కానీ ఆ ఆశయ సాధనలో అడుగు ముందుకు వేసేవారు చాలా తక్కువ. ఆ అడుగులు వేసిన వారు కూడా ఓటమి ఎదురైతే చాలు... ఇక దాని వైపే చూడరు. కానీ ఒక యువకుడు ఓటమికే ఎదురెళ్ళాడు. ఎన్నిసార్లు ఓడిపోయినా కూడా ఆగకుండా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి అనుకున్నది సాధించాడు. అతని పేరు శివాజీ. ఊరు శ్రీకాకుళం.

శివాజీ సాధించినది చిన్న ప్రభుత్వ ఉద్యోగమే కావచ్చు. కానీ అతను 24సార్లు ఓడిపోయినా 25వసారి కూడా ప్రయత్నించాడు. ఆ పట్టుదల గురించే...