భారతదేశం, డిసెంబర్ 15 -- తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పోరు అనేక ఘర్షణలకు దారితీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థులపై దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పాత కక్షలు ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బయటకు వస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తమ్ముడు.. బీఆర్ఎస్ మద్దతుదారుడి ఇంటిని ట్రాక్టర్‌తో ఢీ కొట్టాడు.

సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య గెలిచాడు. బీఆర్ఎస్ మద్దతుతారుడు బిట్ల రాజు కూడా గట్టి పోటీని ఇచ్చాడు. తమపై పోటీ చేసినందుకు ట్రాక్టర్‌తో రాజు ఇంటిని కొత్త సర్పంచ్ పాపయ్య తమ్ముడు ఢీకొట్టారని బీఆర్ఎస్ చెబుతోంది. ట్రాక్టర్ తో దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హ...