భారతదేశం, ఆగస్టు 17 -- భారతీయ జనతా పార్టీ(బీజేపీ).. మహారాష్ట్ర గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్‌ను ఎన్డిఏ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికకు పార్టీ నుంచి ఎంపికను ఖరారు చేయడానికి ఏర్పాటు చేసిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశం తర్వాత బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా.. సీపీ రాధాకృష్ణన్‌ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు.

కేంద్ర మంత్రి జితన్ రామ్ కూడా ఈ విషయాన్ని తెలిపారు. 'ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మేం పూర్తిగా మద్దతు ఇస్తున్నాం.' అని కేంద్ర మంత్రి జితన్ రామ్ అన్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....