భారతదేశం, ఏప్రిల్ 29 -- ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా రానున్న ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా నెలకొన్నాయి. దేవరతో గతేడాది సూపర్ హిట్ కొట్టారు ఎన్టీఆర్. కేజీఎఫ్ 1,2, సలార్ చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్‍లో ప్రశాంత్‍కు క్రేజ్ ఉంది. దీంతో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్‌పై చాలా క్రేజ్ మరింత ఎక్కువ ఉంది. ఈ తరుణంలో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఓ భారీ అప్‍డేట్‍ను మూవీ టీమ్ నేడు (ఏప్రిల్ 29) వెల్లడించింది.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది 2026 జూన్ 25వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. సోషల్ మీడియా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ డేట్‍ను ప్రకటించాయి. వచ్చే ఏడాది జూన్ 25న ఎ...