Andhrapradesh,vijayawada, మే 18 -- ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. విజయవాడలోని డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నారు. అయితే వీటిని రెగ్యూలర్ రిక్రూట్ మెంట్ కాకుండా... ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేస్తారు. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులు 2 ఉండగా..కంప్యూటర్ ఆపరేటర్ ఖాళీలు 4 ఉన్నాయి. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఖాళీలు 9 ఉన్నాయి.సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు బీటెక్(సీఎస్ఈ, ఈసీఈ, ఐటీ) చేసి ఉండాలి. అంతేకాకుండా రెండేళ్లపాటు పని చేసిన అనుభవం ఉండాలి.

కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేయటంతో పాటు కంప్యూటర్ స్పెషలైజేషన్ ఉండాలి. రెండేళ్లపాటు పని చేసిన అనుభవ...