భారతదేశం, జనవరి 4 -- డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచిత వైద్య సేవ‌లు అందించ‌డంలో సానుకూల‌మైన మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ స్ప‌ష్టం చేశారు. ఈ ప‌థ‌కం కింద కూట‌మి ప్ర‌భుత్వ పాల‌న‌లో భారీగా పెరిగిన వ్య‌యం మ‌రియు ల‌బ్దిదారుల సంఖ్య ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని మంత్రి తెలిపారు. డాక్ట‌ర్ ఎన్టీఆర్ వైద్య సేవ‌ల అమ‌లును, 108 మ‌రియు 104 సేవ‌ల‌ను శనివారంనాడు వ‌ర్చువ‌ల్ గా సంబంధిత అధికారుల‌తో మంత్రి వివ‌రంగా స‌మీక్షించారు. 108 సేవ‌ల‌కు సంబంధించిన టెండ‌ర్ లో కూట‌మి ప్ర‌భుత్వం గ‌తానికి భిన్నంగా క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు విధించ‌డంతో ఈ సేవ‌లు ఎంతో మెరుగుప‌డ్డాయ‌ని మంత్రి వివ‌రించారు.

"2022-24 కాలంలో ఆరోగ్య‌శ్రీ కింద మొత్తం 23,08,930 మంది కింద ల‌బ్దిపొందారు. దీని ప్ర‌కారం స‌గ‌టున నెల‌కు 96,205 మందికి ఆరోగ్యశ్రీ...