Hyderabad, అక్టోబర్ 3 -- జూనియర్ ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ వార్ 2 సుమారు రెండు నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. వచ్చే వారం సినిమా రానుండగా.. హృతిక్ రోషన్ అప్పుడే డిజిటల్ ప్రమోషన్ మొదలు పెట్టాడు. ఈ సినిమా గురించి అతడు ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ ఆగస్టు 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా.. ఇప్పటి వరకూ డిజిటల్ ప్రీమియర్ కాలేదు. మొత్తానికి అక్టోబర్ 9 నుంచి ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయబోతోంది. తెలుగుతోపాటు హిందీ, తమిళంలలోనూ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు ముందు శుక్రవారం (అక్టోబర్ 3) హృతిక్ రోషన్ ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేశాడు.

""కబీర్ పాత్ర పోషించడం చాలా సరదాగా అనిపించింది. చాలా రిలాక్స్‌డ్‌గా చేశాను. ఎందుకంటే నాకు ఆ...