భారతదేశం, నవంబర్ 24 -- ప్రభాస్ అప్ కమింగ్ మూవీ రాజా సాబ్. ఈ సినిమా నుంచి ఆదివారం (నవంబర్ 23) రాత్రి రెబల్ సాబ్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సాంగ్ లాంఛ్ సందర్భంగా డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మారుతి సారీ కూడా చెప్పాడు. అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి.

రాజా సాబ్ మూవీ డైరెక్టర్ మారుతి కామెంట్లు కాంట్రవర్సీకి కారణమయ్యాయి. రెబల్ సాబ్ సాంగ్ లాంఛ్ ఈవెంట్లో సినిమా గురించి, ప్రభాస్ గురించి మారుతి గొప్పగా మాట్లాడాడు. ఈ క్రమంలోనే కాలర్ ఎగరేసుకుని చెప్పమంటూ చేసిన కామెంట్లు వివాదానికి దారి తీశాయి.

''మీరందరూ రేపు పండక్కి.. నేను యాక్చువల్ గా ఏంటంటే కాలర్ ఎగరేసుకుంటారు అని అలా చెప్పాలేను. అవన్నీ ఈ కటౌట్ కు చాలా చిన్న మాటలు అయిపోతాయి. ఎందుకంటే నేను ప్రస్తుతం రెబల్ యూని...