భారతదేశం, ఆగస్టు 15 -- జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మల్టీ స్టారర్.. తారక్ కు బాలీవుడ్ లో ఫస్ట్ ఫిల్మ్.. పైగా ఫేమస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనియర్స్ లో చిత్రం.. ఇలా ఎన్నో స్పెషాలిటీస్ మధ్య వార్ 2 థియేటర్లలోకి వచ్చింది. గురువారం (ఆగస్టు 14) ఈ మూవీ విడుదలైంది. కానీ మిక్స్ డ్ టాక్, రజనీకాంత్ కూలీ మేనియాతో వార్ 2 సినిమాకు ఆశించిన స్థాయిలో వరల్డ్ వైడ్ కలెక్షన్లు రాలేదనే చెప్పొచ్చు. మరి ఫస్ట్ డే వార్ 2 ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్లు రాబట్టిందో చూద్దాం.

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై థ్రిల్లర్ యూనివర్స్‌లో తాజా చిత్రం వార్ 2. దీనికి అయాన్ ముఖర్జీ డైరెక్టర్. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న ఈ మూవీ రిలీజైంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ పాన్ ఇండియా స్పై థ్రిల్లర్ రజనీకాంత్ నటించిన కూలీతో పోటీ పడుతోంది. వార్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద మంచ...