భారతదేశం, ఏప్రిల్ 29 -- ఏపీలో సామాజిక పెన్షన్ల తనిఖీలో తవ్వే కొద్ది అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అనర్హులకు పెన్షన్లు చెల్లిస్తున్నారని ప్రజా ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో ఏపీ ప్రభుత్వం వికలాంగుల పెన్షన్ల తనిఖీ చేపట్టింది. వికలాంగులకు రూ.6 వేల నుంచి రూ.15వేల వరకు పెన్షన్లు చెల్లిస్తుండటంతో పెద్ద ఎత్తున అనర్హులు వాటిని దక్కించుకుంటున్నారు.

ఏపీప్రభుత్వం అందిస్తోన్న సామాజిక పెన్షన్లను తప్పుడు ధృవీకరణ పత్రాలతో పొందుతున్నవారి డొంక కదులుతోంది. గత మూడు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం సామాజిక పెన్షన్లను వైద్య బృందాలతో తనిఖీ చేయిస్తోంది. ఈ క్రమంలో బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందుతున్న వారిని పెద్ద సంఖ్యలో గుర్తించారు.

ఏపీలో నెలకు రూ.6 వేలు నుంచి రూ.15వేల వరకు సామాజిక పెన్షన్లను చెల్లిస్తున్నారు. ఈ క్రమంలో ...