భారతదేశం, ఏప్రిల్ 15 -- అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ జంటగా నటించిన తమిళ్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్ర నిర్మాతలకు సంగీత దర్శకుడు ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారు. అనుమతి లేకుండా తన పాటలను వాడుకున్నందుకు రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రాతపూర్వకంగా క్షమాపణ కూడా చెప్పాలన్నారు. అయితే దీనిపై గుడ్ బ్యాడ్ అగ్లీ ప్రోడ్యూసర్స్ స్పందించారు. పాటలు వాడుకునేందుకు ఎన్ఓసీ తీసుకున్నామని స్పష్టం చేశారు.

మీడియా ఫ్యాక్టరీతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని నిర్మించింది. తాజాగా ఇళయరాజా పంపించిన లీగల్ నోటీసులపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత యలమంచిలి రవిశంకర్ స్పందించారు. గుడ్ బ్యాడ్ అగ్లీలో ఇళయరాజా పాటలను ఉపయోగించడంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని హిందూస్థాన్ టైమ్స్ తో తెలిపారు. రూల్స్ ప్రకారమే నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) తీసుకున్...