భారతదేశం, ఫిబ్రవరి 17 -- దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) రాజీవ్ కుమార్ ఈ నెల 18న పదవీ విరమణ చేయనున్నారు. అంతకు ఒక రోజు ముందు సోమవారం తన వీడ్కోలు ప్రసంగంలో ఆయన తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. దేశ రాజధానిలోని కమిషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో ప్రసంగించారు. ఎన్నికల కమిషన్‌లో మార్పులు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు), వలస కార్మికులకు రిమోట్ ఓటింగ్‌కు కమిషన్ అవకాశం కల్పించాలని కుమార్ అన్నారు. బయోమెట్రిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎన్నికల్లో ఓట్లు వేయడం ద్వారా ఎన్నికల పారదర్శకతలో పెను విప్లవం తీసుకురావచ్చన్నారు.

ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. దేశం వెలుపల నివసిస్తున్న ఎన్ఆర్ఐలు, రాష్ట్రం వెలుపల నివసిస్త...