భారతదేశం, మే 18 -- నిత్యం గోవింద నామస్మరణతో మార్మోగే తిరుపతి నగరం.. మద్యం మత్తులో జోగుతోంది. తిరుపతిలో మద్యం ఏరులై పారుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం తెల్లవారుజామున 5.20 గంటలకే మద్యం షాపులు ఓపెన్ చేశారు. వైసీపీ తిరుపతి నియోజకవర్గం సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి.. ఉదయం 6 గంటల లోపు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే.. విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.

భక్తులు తిరుపతిలో అడుగుపెట్టగానే మద్యం బాటిల్లు ప్రత్యక్షమవుతున్నాయి. గుడులు, బడులు తెరవకముందే, వైన్ షాపులు తెరుస్తున్నారు. పిల్లలు ఇంటి దగ్గర నుంచి బడికి వెళ్లాలి అంటే.. కనీసం రెండు మూడు మద్యం దుకాణాలు దాటాల్సిన పరిస్థితి ఉందని నగరవాసులు చెబుతున్నారు. మద్యం దుకాణాలు తలనొప్పిగా మారిందని అంటున్నారు. కొందరు జేబులు నింపుకోవడానికి విచ్చలవిడిగ...