భారతదేశం, మే 25 -- బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన 'జాట్' చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ మూవీతో బాలీవుడ్‍లోకి ఎంట్రీ ఇచ్చారు. యాక్షన్ ప్యాక్డ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మోస్తరు వసూళ్లను దక్కించుకుంది. ఇక జాట్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‍కు సమీపిస్తోంది.

జాట్ చిత్రం జూన్ 5వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్‍కు రానుందనే అంచనాలు వెలువడుతున్నాయి. థియేటర్లలో రిలీజైన ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్‍కు తెచ్చేలా మేకర్లతో నెట్‍ఫ్లిక్స్ డీల్ చేసుకుందని తెలుస్తోంది. దీంతో జూన్ 5న స్ట్రీమింగ్‍కు వస్తుందని సమాచారం. నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

జాట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా...