భారతదేశం, మార్చి 16 -- చర్మాన్ని బట్టి, ముఖాకృతులను బట్టి చూస్తే, మనలో చాలా మంది అందంగా, మంచివారిలా కనిపించొచ్చు. కానీ, పైపై మెరుగులు చూసి ఎవరినైనా అంచనా వేసేయొచ్చా? వారు నిజంగా మంచివారా? కాదా.. అనే క్లారిటీ మనకెలా వస్తుందోనని ఎప్పుడైనా ఆలోచించారా? రండి, దీని గురించి సైకాలజిస్టులు ఒక థియరీ చెబుతున్నారు. దానిని బట్టి ఒక వ్యక్తి నిజంగా మంచివాడా కాదా అని ఇట్టే తెలుసుకోవచ్చట. అంతకంటే ముందు, అందరితో కలుపుగోలుగా ఉంటూ, నవ్వుతూ కనిపించే వ్యక్తి మంచివాడని వెంటనే నమ్మేసి మోసపోవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే, మనముందు కనిపించినట్లుగా వారి వ్యక్తిత్వం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందని చెప్పలేం.

ఒక వ్యక్తిని మంచివాడని కన్ఫమ్ చేయాలంటే, కొన్ని లక్షణాలను పరిశీలించాలట. అవేంటంటే, నిజాయితీ, కృతజ్ఞత, ధైర్యం, కష్టకాలంలోనూ చెక్కు చెదరని సంకల్పం బట్టి ఆ వ్యక్తిని మంచివ...