Hyderabad, మే 19 -- గురువింద గింజ చూసేందుకు బయటకు ఎర్రగా కనిపిస్తుంది. కానీ దాని కిందన నలుపు మచ్చలా ఉంటుంది. ఎంతోమంది గురివింద గింజలాంటివారు ఉంటారు. తమ లోపాలను గుర్తించలేరు... కానీ ఎదుటివారిలో తప్పులను ఎంచుతూనే ఉంటారు. వారిని వేలెత్తి చూపిస్తూనే ఉంటారు.

ఎదుటివారి తప్పులు వెతకడం పనిగా పెట్టుకుంటే మీ పక్కన ఎవరూ మిగలరు. బంధువులు, స్నేహితులు అందరూ దూరమైపోతారు. చివరికి మీరు ఒక్కరే ఒంటరిగా మిగిలాల్సి వస్తుంది.

ఎదుటివారిలో తప్పులు వెతుకుతూ, వారిని కించపరచడం, వేలెత్తి చూపించడమే పనిగా పెట్టుకుంటే ఎదుటివారి జీవితం కాదు... మీ జీవితమే అల్లకల్లోలంగా మారుతుంది. సుఖసంతోషాలు అనేవి దూరమైపోతాయి. ఒక్క వేలితో మీరు పక్క వాడిని చూపిస్తే... మిగతా వేళ్లు మీ వైపే చూపిస్తాయని తెలుసుకోండి. ఆ తర్వాతే ఎదుటివారిని నిందించడం ప్రారంభించండి.

నిందించడమే పనిగా పెట్టుకున...