Hyderabad, సెప్టెంబర్ 4 -- "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనూజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివాని నాగరం లీడ్ రూల్స్‌లో నటించిన కామెడీ మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ సినిమాను ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు.

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్‌గా రిలీజ్ చేస్తున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా ఈ నెల 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది.

ఈ సందర్భంగా లిటిల్ హార్ట్స్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు యంగ్ హీరో శ్రీవిష్ణు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించిన లిటిల్ హార్ట్స్ ప్రీ రి...