Hyderabad, సెప్టెంబర్ 23 -- జూనియర్ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు రెండున్నర నెలల తర్వాత డిజిటల్ ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని ఆహా వీడియో ఓటీటీ మంగళవారం (సెప్టెంబర్ 23) అధికారికంగా అనౌన్స్ చేసింది. శ్రీలీల, కిరీటి రెడ్డి జంటగా నటించిన రొమాంటిక్ యాక్షన్ డ్రామా ఇది.

జూనియర్ మూవీ జులై 18న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి లీడ్ రోల్ కావడం, శ్రీలీల అతని సరసన నటించడంతో మూవీపై ఆసక్తి రేగింది. అయినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.

ఇప్పుడీ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. "సీనియర్ కి సెమిస్టర్ ఎగ్జామ్ ఉందని జూనియర్ 30కి వస్తున్నాడు. జూనియర్ మూవీ సెప్టెంబర్ 30న స్ట్రీమింగ్" అనే క్యాప్షన్ తో ఆహా వీడియో ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

జూనియర్ మూ...