Hyderabad, ఏప్రిల్ 16 -- బిజీ, ఒత్తిడిలతో నిండిన ఆధునిక జీవనశైలిలో మనం ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే కష్టంగా మారింది. డెడ్‌లైన్స్, ట్రాఫిక్, గ్యాడ్జెట్లు. ఇవన్నీ మన రోజువారీ జీవితాన్ని ఆక్రమించేయడంతో, శరీరానికి శ్రమ పెట్టే అవకాశం చాలామందికి దొరకడం లేదంటే తప్పేం లేదేమో.కానీ ఆయుష్షు పెరగాలంటే ఎలాంటి నొప్పులు వ్యాధుల బాధలు లేకుండా బతకాలంలే రోజులో కాసైపైనా శరారీక శ్రమ చేయాల్సిన అవసరం ఉంది. అలా అని గంటల పాటు జిమ్‌లో గడపాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని నిమిషాల్లోనే శరీరాన్ని బలంగా, ఆకర్షణీయంగా మార్చే ఒక అద్భుతమైన వ్యాయామం ఉంది. అదే పుల్-అప్స్!

పుల్-అప్స్ అనేవి ప్రత్యేకమైన ఎక్విప్‌మెంట్ అవసరం లేని, ఇంట్లోనే చేయగల పవర్‌ఫుల్ వ్యాయామం. మీరు ప్రారంభ దశలో ఉన్నవారైనా, రోజూ వ్యాయామం చేసేవారైనా సరే వీటిని చేయచ్చు. పుల్-అప్స్ అన్ని వయస్సుల వారికి అనుకూలమైనవ...