Hyderabad, ఏప్రిల్ 20 -- కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేసేవారు రోజులో ఎక్కువసేపు ఒకే చోట అదే భంగిమలో ఉండిపోవాలి. అది మంచం మీదనో, కుర్చీలోనో ఒకే విధంగా ఉండి పనిచేసుకోవాలి. అలా రోజంతా కదలికలు లేకుండా ఒకే చోట ఉంటే శరీరంలోని కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా కాళ్లు, వెన్ను భాగం, వక్షోజాలు వంటి భాగాల్లో శరీరం వదులుగా మారిపోతుంది. ఫలితంగా చూడటానికే కాదు, శారీరకంగా కూడా కరెక్ట్‌గా ఉండదు. అయితే సరైన వ్యాయామంతో వెన్ను కండరాలు, ఛాతీ కండరాలు, కాలు కండరాలు బలోపేతం అవుతాయి. అంతేకాకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగానూ ఉండగలం.

దీని కోసం అలనాటి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతి జింతా కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలను సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే ఆమె స్వతహాగా ఫిట్నెస్ ఔత్సాహికురాలు. వీడియోల రూపంలో వర్కౌట్ల గురించి తెలియజేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ...