Telangana,hyderabad, జూలై 10 -- కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను ఎవ్వరికీ తాకట్టు పెట్టమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఉద్ఘాటించారు. ఎంతటి వారొచ్చినా నిటారుగా నిలబడి కొట్లాడుతామన్నారు. దేవుడే ఎదురుగా వచ్చి నిలబడినా ఎదురించి ప్రజలకు అండగా నిలబడుతామని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజల్లో శాశ్వతంగా, గొప్పగా నిలిచిపోయే విధంగా మా ప్రభుత్వ విధానం ఉంటుందని చెప్పారు. ప్రజల హక్కులను తాకట్టు పెట్టమని తేల్చి చెప్పారు.

ప్రజలు ఒక విశ్వాసం, నమ్మకంతో తమకు అవకాశం ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా, గోదావరి జిలాల్లో తెలంగాణ హక్కుల విషయంలో ఎవ్వరూ అధైర్య పడొద్దు అని భరోసానిచ్చారు. "కృష్ణా, గోదావరి నదీ జలాలు : వినియోగం : వివాదాలు" అన్న అంశంపై జ్యోతీరావు పూలె ప్రజా భవన్‌లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్...