Telangana,warangal, జూలై 26 -- రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కన్వీనర్‌ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్‌(2025-26) ప్రవేశాలను కల్పిస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

కన్వీనర్‌ కోటా సీట్ల కోసం విద్యార్థుల నుంచి కాళోజీ యూనివర్శిటీ దరఖాస్తులను స్వీకరిస్తోంది.ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ గడువు జూలై 25వ తేదీతోనే పూర్తి అయింది. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో అధికారులు ఈ గడువును పొడిగించారు. జూలై 30వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్, మైనారిటీ, నాన్‌ మైనారిటీ మెడికల్, డెంటల్‌ కాలేజీలలోని కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్‌ వర్తిస్తు...