భారతదేశం, మే 18 -- మాటలకందని విషాదం ఇది. పొద్దున నిద్ర లేవకముందే.. అగ్నిప్రమాదం రూపంలో యమపాశం దూసుకొచ్చింది. ఏటూ కదలకుండా చేసి.. ప్రాణాలు తీసింది. హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ వద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 17 మంది వరకు చనిపోయారు. మృతుల్లో ఎనిమిది మంది చిన్న పిల్లలు ఉండటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఈ 8 మంది చిన్నారుల్లో ఒకరి వయస్సు ఒకటిన్నర ఏండ్లే. మరొకరికి ఏడేళ్లు. నాలుగు ఏళ్ల లోపు పిల్లలు ఆరుగురు చనిపోయారు. వీరే కాకుండా మృతుల్లో వృద్ధులు ఉన్నారు. నలుగురు అరవై ఏళ్ల నుంచి డెబ్బై ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. మృతుల్లో ఐదుగురు ముప్పై నుంచి నలభై ఏళ్ల లోపు వయస్సు వారున్నారు. ఈ ఘటనతో చార్మినార్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఎస్టీఆర్ఎఫ్ ప్రకారం మృతుల వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రహల్లాద్ (70)

మున్ని (70)

రాజేందర్ మోదీ (65...