Hyderabad, ఏప్రిల్ 13 -- మీ శరీర బరువు రోజు రోజుకీ పెరుగుతుందా? వ్యాయామం, ఆహార నియంత్రణ వంటి ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫ్యాట్ లాస్‌పై ఎటువంటి ప్రభావం చూపడం లేదా. అయితే ఇందుకు కారణం మీ శరీరంలోని కొన్ని హార్మోన్లు అయి ఉండచ్చు. ముందుగా మీ శరీరంలోని హార్మోన్ల స్థాయిలను చెక్ చేసుకోండి. ఎందుకంటే హార్మోన్ల అసమతుల్యత అనేది బరువు తగ్గుదలకు అడ్డుగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. వీటి కారణంగానే చాలా మంది వెయిట్ టాస్ కోసం పడే కష్టం అంతా వృథా అవుతుందని నిపుణులు చెబుతున్నారు. శరీర బరువు తగ్గుదలను కష్టతరం చేసే హార్మోన్లలో ముఖ్యమైన 5 రకాల హార్మోన్లు, వాటి సమతుల్యత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం రండి.

ఇన్సులిన్ హార్మోన్ క్లోమం నుండి ఉత్పత్తి అవుతుంది. దీని వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు ప్రభావితమవుతాయి. ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా పన...