భారతదేశం, జూలై 24 -- ఎండు చేపలు... కొందరికి వాటి ఘాటైన వాసన అస్సలు నచ్చదు. మరికొందరికి మాత్రం అది లేనిదే ముద్ద దిగదు. ఈ వాసన సంగతి పక్కన పెడితే, ఎండు చేపలు నిజంగా ఆరోగ్యకరమైనవా? ఈ ప్రశ్నకు నిపుణులు అవుననే సమాధానం ఇస్తున్నారు. ప్రోటీన్ నుంచి ఐరన్, విటమిన్ డి వరకు ఎన్నో పోషకాలతో ఎండిన చేపలు నిండి ఉన్నాయని వారు చెబుతున్నారు.

జూలై 23న డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తన X పోస్టులో ఎండు చేపల ఫోటోను పంచుకుంటూ, "ఎండిన చేపలు ప్రొటీన్‌కు గొప్ప వనరు. ముఖ్యంగా తీరప్రాంతాల్లో చేపలు తినే కమ్యూనిటీలలో అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకాలకు ఇది మంచి అనుబంధంగా ఉండగలదు" అని రాశారు. ఇది ఎండు చేపల పోషక విలువలు, అవి శరీరానికి ఎలా సహాయపడతాయో అనే విషయాన్ని మన దృష్టికి తీసుకొస్తుంది.

హెచ్‌టి లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గురుగ్రామ్‌లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన...