Hyderabad, మే 5 -- వేసవి కాలంలో చాలా మందికి తరచూ కంటిని కడుక్కోవడం అలవాటుగా ఉంటుంది. అంతేకాకుండా గంటల తరబడి స్క్రీన్ ముందు గడిపేవారు కూడా విశ్రాంతి కోసం మధ్య మధ్యలో కడుగుతూ ఉంటారు. అధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము, కాలుష్యం వంటి కారణాలతో కళ్ళలో దురద వంటి సమస్యల కారణంగా మరి కొందరు కంటిని కడుక్కుంటూ ఉంటారు. కారణం ఏదైనా ఇలా తరచూ కంటిని కడుక్కోవడం మంచిదేనా? వేసవిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరైన పద్ధతులు ఏమిటి? తరచూ కళ్ళు కడుక్కోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, పరిమితులు ఏమిటి? కంటి పరిశుభ్రత కోసం ఉత్తమమైన మార్గాలు ఏమిటో తెలుసుకుందాం రండి.

కళ్ళను తరచూ కడుక్కోవడం వల్ల కంటికి చక్కటి ఉపశమనం కలిగినప్పటికీ. ఎక్కువ సార్లు కడగడం మంచిది కాదు. నిపుణులు దీనిని సిఫార్సు చేయరు. వారి ప్రకారం.. కంటిని అతిగా కడగడం వల్ల కళ్ళలోని సహజ రక్షణ పొర దెబ్బతినవచ్చు. దీని ఫ...