Adilabad,telangana, ఏప్రిల్ 24 -- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగిపోయింది. నిప్పుల కొలిమిలా మారిపోయింది. బుధవారం గరిష్టంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో జిల్లాలో ఉదయం నుంచే భానుడు.. భగభగలా మండిపోతున్నాడు.

దీంతో జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో సైతం మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మూడు రోజులుగా అన్ని మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అధికారులు ఆరెంజ్, రెడ్ అలర్ట్ జారీ చేశారు.

ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లేందుకు కూడా జనాలు జంకుతున్నారు. దాహం తీర్చుకునేందుకు చల్లని శీతల పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. కొంత మంది వడదెబ్బకు గురై ఆసుపత్రుల పాలవుతున్న సంఘటనలు కూడా వెలుగులో...