Hyderabad, ఏప్రిల్ 16 -- మజ్జిగ చారు అనగానే అందరూ మజ్జిగ చేసి అందులో పోపు వేయడమే అనుకుంటారు. అలా చేయడం వల్ల మజ్జిగ రుచిగా ఉండదు. ఇక్కడ మేము చెప్పిన పద్ధతిలో మజ్జిగ చారు చేసి చూడండి. ఇది పొట్టను చల్లగా ఉంచడమే కాదు... నోటికి కూడా కమ్మగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం మజ్జిగ చారు టేస్టీగా ఎలా చేయాలో తెలుసుకోండి. పొట్టకు చలువ చేసేలా కూడా చేయడం చాలా ముఖ్యం.

పెరుగు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయ - ఒకటి

పచ్చిమిర్చి - మూడు

అల్లం - చిన్న ముక్క

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

నూనె - అర స్పూను

పచ్చిశనగపప్పు - అర స్పూను

మినప్పప్పు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

ఆవాలు - అర స్పూను

వెల్లుల్లి రెబ్బలు - నాలుగు

ఎండుమిర్చి - నాలుగు

కరివేపాకులు - గుప్పెడు

పసుపు - పావు స్పూను

1. మజ్జిగ చారు చేసేందుకు ముందుగా ఒక గిన్నెలో పెరుగును వేసి బాగా ...