Hyderabad, ఏప్రిల్ 24 -- వేసవిలో అకస్మాత్తుగా ఇంటికి అతిథులు వస్తే వారికి కూల్ డ్రింక్స్ ఇస్తారు. కూల్ డ్రింక్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎండలో వచ్చినవారికి శరీరానికి చలువ చేసే పానీయాన్ని ఇవ్వాలి. ఇక్కడ మేము పుదీనా రిఫ్రెష్ డ్రింక్ రెసిపీ ఇచ్చాము. దీని రుచి అద్భుతంగా, చాలా రిఫ్రెష్ గా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరచడానికి కూడా సహాయపడుతుంది.

పుదీనాలో కూలింగ్ గుణాలున్నాయి. ఇది వేసవిలో శరీరాన్ని లోపలి నుండి చల్లబరుస్తుంది. కాబట్టి ఇంట్లో ఎండ నుంచి బయటకు వచ్చిన వారికి ఈ డ్రింక్ బాడీ హీట్ ను కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని తయారు చేయడం చాలా సులభం. రెసిపీని నోట్ చేసుకోండి.

తాజా పుదీనా ఆకులు - ఒక కప్పు

ఉప్పు - రుచికి సరిపడా

పంచదార - పావు స్పూను

నిమ్మరసం - రెండు స్పూన్లు

ఐస్ క్యూబ్స్ - మూడు

స్ప్రైట్ లేదా సోడా - ఒక గ్లాసు

అతిథులు హఠ...