Hyderabad, ఏప్రిల్ 7 -- వేసవి తాపంలో బయటకు రావడమే చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో శారీరక సమస్యలతో పాటు చర్మ సంబంధ సమస్యలు కూడా వస్తాయి. సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల ముఖ చర్మం ఎర్రగా మారిపోతుంది. చర్మ కణాలకు చాలా నష్టం జరుగుతుంది. సూర్యరశ్మి వేడికి చర్మంలో వాపు, ఎరుపు వంటివి వస్తాయి.

ఎండ వేడిమికి చర్మానికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. అలాంటప్పుడు వారికి ఎరుపు, నొప్పి, వాపు కనిపిస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే చర్మంపై బొబ్బలు వస్తాయి. ఇవన్నీ వడదెబ్బకు చెందిన తేలికపాటి లక్షణాలు. వీటిని తగ్గించుకోవడానికి ఇంట్లోనే చిన్న చిట్కాలను పాటించవచ్చు.

కలబంద లోషన్, జెల్ లేదా కాలమైన్ లోషన్ సౌకర్యవంతంగా ఉంటుంది. అప్లై చేయడానికి ముందు, ఉత్పత్తిని ఫ్రిజ్లో ఉంచండి. చల్లారిన తర్వాత ముఖానికి అప్లై చేయండి. వడదెబ్బకు గురైన చర్మంపై ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులను ...