భారతదేశం, డిసెంబర్ 15 -- ఇండియాలో ఎంజీ మోటార్స్​కి బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటిగా ఉంది ఎంజీ హెక్టార్​. ఇప్పుడు ఈ మోడల్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ని సంస్థ లాంచ్​ చేసింది. ఈ ఎంజీ హెక్టార్​ ఫేస్​లిఫ్ట్​ ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 11.99లక్షలుగా ఉంది. ఇది ఇంట్రొడక్టరీ ప్రైజ్​ అని గుర్తుపెట్టుకోవాలి.

హెక్టార్ ఎస్‌యూవీని మొదటిసారిగా 2019లో భారత మార్కెట్‌లో పరిచయం చేశారు. అప్పటి నుంచి ఇది అనేక అప్‌డేట్‌లను పొందింది. ఈ విభాగంలో పనోరమిక్ సన్‌రూఫ్, వర్టికల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించిన మొదటి కారు ఇదే! కొత్త మోడల్ ప్రత్యేకంగా కనిపించేలా ఇందులో అనేక కాస్మొటిక్​ మార్పులు, కొన్ని ఫీచర్లను అప్‌డేట్‌ చేశారు.

ఈ లేటెస్ట్​ లాంచ్​ ఎస్‌యూవీకి మూడొవ ఫేస్‌లిఫ్ట్ అవుతుంది. హెక్టార్ మోడల్‌కు అతిపెద్ద అప్‌డేట్ 2023లో వచ్చింది. అప్పుడు ఎం...