భారతదేశం, ఆగస్టు 3 -- ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లను జనాలు ఎక్కువగా కొంటున్నారు. ఇంధన ఖర్చులు కలిసి వస్తాయని చాలా మంది ఆలోచన చేస్తున్నారు. ఇటీవల ఎంజీ సైబర్‌స్టర్, టెస్లా మోడల్ వై భారత మార్కెట్లోకి ప్రవేశించాయి. రెండూ ప్రీమియం సెగ్మెంట్ వాహనాలు, కానీ వాటి టార్గెట్ కస్టమర్లు భిన్నంగా ఉంటారు. ఎంజి సైబర్ స్టర్ భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్టబుల్ రోడ్ స్టర్. అదే సమయంలో టెస్లా మోడల్ వై ఒక ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్రీమియం ఎస్యూవీ, ఇది ఎక్కువ స్థలం టెక్నాలజీ, సౌలభ్యాన్ని కోరుకునే వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఈ రెండు కార్ల ప్రత్యేకతల గురించి వివరంగా తెలుసుకుందాం.

ఎంజీ సైబర్‌స్టర్ భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధర రూ .72.49 లక్షల నుండి రూ .74.99 లక్షల వరకు ఉంది. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కన్వర్టబుల్ రోడ్ స్టర్. దీని డి...