భారతదేశం, మే 2 -- ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలతో విసిగిపోయిన ప్రజలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ కార్లు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. టాటా మోటార్స్ ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలలో ముందంజలో ఉంది. టాటా ప్రతి నెలా రికార్డు స్థాయిలో ఈవీలను డెలివరీ చేస్తోంది. టాటా నెక్సాన్ ఈవీకి భారీ డిమాండ్ ఉంది. ఇప్పుడు చైనాకు చెందిన ఎంజీ మోటార్ భారతదేశంలో నెక్సాన్‌కు సరైన పోటీదారుని విడుదల చేసింది. అదే ఎంజీ విండ్సర్ ఈవీ.

రెండు కార్ల మధ్య ధర, లక్షణాలు, పనితీరు గురించి చూద్దాం.. కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 12.49 లక్షలు నుంచి రూ. 17.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు వరకు ఉంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలలో కొనుగోలు చేయడానికి అందుబ...