భారతదేశం, నవంబర్ 12 -- బెంగళూరుకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఫోర్​ వీలర్​ వెహికిల్​ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోందన్న ఊహాగానాలు, తాజాగా దాఖలు చేసిన డిజైన్ పేటెంట్లతో మళ్లీ తెరపైకి వచ్చాయి. ఈ పేటెంట్లు ఒక కాంపాక్ట్, నిటారుగా ఉండే ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ) రూపాన్ని సూచిస్తున్నాయి. భారతీయ మార్కెట్ నేపథ్యంలో.. దీనిని ఎంజీ కామెట్ ఈవీతో పోల్చవచ్చు. అయితే, ఈ స్కెచ్‌లు కొన్ని ఆధారాలు ఇస్తున్నప్పటికీ, ఉత్పత్తి గడువులు, సాధ్యత, కాన్సెప్ట్‌ను వాస్తవ ఉత్పత్తిగా మార్చే ఓలా సామర్థ్యంపై మాత్రం సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఓలా ఎలక్ట్రిక్​ ఈవీ డిజైన్ పేటెంట్లు ఒక పొడవైన, ఇరుకైన ఆకృతిని, తక్కువ ఓవర్‌హాంగ్‌లను, స్క్వేర్డ్-ఆఫ్ సిల్హౌట్‌ను చూపుతున్నాయి. ముందు భాగంలో అడ్డంగా ఉన్న పెద్ద లైటింగ్ ఎలిమెంట్, క్లీన్ సర్ఫేసింగ్ ఉంది. ఇది ఈవీ-నిర్దిష్ట డిజైన...