Hyderabad,telangana, సెప్టెంబర్ 27 -- హైదరాబాద్‌ నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీనికితోడు జంట జలాశయాలకు భారీగా వరద రావటంతో గేట్లు ఎత్తారు. వర్షం నీళ్లకు తోడు. జలాశయాల నుంచి వరద నీటితో మూసీ ఉప్పొంగిపోయింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చే చేరింది. నది ఒడ్డునే ఉండే ఎంజీబీఎస్ బస్ స్డాండును కూడా వరద నీరు ముంచెత్తింది.

వరద ఉద్ధృతికి ఎంజీబీఎస్‌లోకి వెళ్లే రెండు బ్రిడ్జిలు నీట మునిగాయి. బస్టాండ్ లోకి నీరు చేరటంతో.. వేల మంది ప్రయాణికులు బస్డాండ్‌లో చిక్కుకుపోయారు. ప్రయాణికులను సురక్షితంగా బయటికి తరలిస్తున్నారు.

మరోవైపు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. మూసీ ఉధృతిపై స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఎంజీబీఎస్ బస్ స్టాండులోని ప్రయాణికులను సురక్షితంగ...