భారతదేశం, ఏప్రిల్ 21 -- అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా మజ్లిస్ పార్టీకి అండగా నిలబడుతున్నాయని.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ పార్టీలు మజ్లిస్‌కు మేలు చేకూర్చే ప్రయత్నం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఎన్నికైన కార్పొరేటర్లు ఓటు హక్కు వినియోగించుకోకుండా.. బీఆర్ఎస్ బెదిరించడం, వారికి ఓటు వేసిన ప్రజల హక్కును అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు.

'హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి ఈరోజు చివరిరోజు. మజ్లిస్ పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీని గెలిపించడం కోసమో.. హైదరాబాద్ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు ఓటు వేయలేదు. ఇదే పాతపట్నంలో మజ్లిస్ పార్టీ వరుసగా గెలుస్తున్న శాసనసభ నియోజకవర్గాల్లో, హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో, మున్సిపల్ కార్పొరేషన్లలో కచ్చితంగా బీఆర్ఎస్...