భారతదేశం, ఏప్రిల్ 18 -- హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచారయత్నం కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. యువతి పోలీసులను తప్పుదోవ పట్టించింది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే ఎస్పీ చందనా దీప్తి వెల్లడించారు. సదరు యువతి సెల్‌ఫోన్‌తో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు జారిపడినట్లు ఎస్పీ వివరించారు.
ఈ ఘటనపై పోలీసులకు కట్టుకథ చెప్పి.. తనపై అత్యాచారం జరిగినట్లు ఆ యువతి పోలీసులను నమ్మించినట్లు చందనా దీప్తి నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా సుమారు 300కుపైగా సీసీ కెమెరాలను రైల్వే పోలీసులు పరిశీలించారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. ఆ తర్వాత యువతిపై అత్యాచారం జరగలేదని తేల్చారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించి.. కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది.
మేడ్చల్ జిల్లాలోని ఓ ప్రైవేటు సంస్థ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.