భారతదేశం, జనవరి 22 -- హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్‌ రైలు, మెట్రో రైలు, టీజీఎస్ఆర్టీసీ సిటీ బస్సులను కనెక్ట్ చేసేలా ప్రభుత్వం ప్లానింగ్ చేస్తోంది. వీటన్నింటినీ అనుసంధానిస్తూ.. సమగ్ర ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించేందుకు ప్రణాళిక ప్రారంభించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్ సబర్బన్ రైలు, మెట్రో రైలు, సిటీ బస్సు సేవలను అనుసంధానించడానికి ప్రణాళికపై కసరత్తు మెుదలుపెట్టింది. దీని ద్వారా మొదటి నుంచి చివరి వరకు కనెక్టివిటీ మెరుగుపడనుంది. ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.

రవాణా, రోడ్లు, భవనాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జనాలు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సేఫ్‌గా వెళ్లేందుకు, సురక్షితమైన రోడ్లు, నమ్మకమైన సేవలపై దృష్టి సారించారు.

ఈ ప్రణాళిక ప్రకారం...