భారతదేశం, మే 11 -- అప్పటివరకూ క్యూట్ గా, పక్కింటి అమ్మాయిలా నటిస్తూ వచ్చిన సమంత ఒక్కసారిగా 'పుష్ఫ ది రైజ్' మూవీలో స్పెషల్ సాంగ్ తో షాక్ ఇచ్చారు. హాట్ డ్యాన్స్ తో అదరగొట్టారు. సమంత నుంచి ఈ సర్ ప్రైజ్ ను ఫ్యాన్స్ ఊహించలేకపోయారు. ఈ సమంత స్పెషల్ సాంగ్ ఓ ఊపు ఊపింది. పుష్ఫ సినిమా బ్లాక్ బస్టర్ కావడానికి ఈ పాట కూడా ఓ రీజన్ అని చెప్పొచ్చు. ఈ సాంగ్ పై తాజాగా సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.

అల్లు అర్జున్‌తో కలిసి పుష్ప: ది రైజ్‌లో సమంత రూత్ ప్రభు ఊ అంటావా పాటతో అభిమానులను అలరించారు. ఈ పాట ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలుసు. గలట్టా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఈ పాట గురించి కొన్ని సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ పాట చేయొద్దని చాలామంది తనకు సలహా ఇచ్చారని ఆమె అన్నారు. ఈ సాంగ్ ను ఛాలెంజ్ గా తీసుకున్నానని పేర్కొన్నారు.

ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చేందుకే ఈ పాట...