భారతదేశం, ఏప్రిల్ 24 -- సీనియ‌ర్ యాక్ట‌ర్ నాజ‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కోలీవుడ్ హార‌ర్ థ్రిల్ల‌ర్ మూవీ ది అకాలి తెలుగులో వ‌స్తోంది.ఏప్రిల్ 26 నుంచి ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విష‌యాన్ని ఆహా ఓటీటీ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. త‌మిళంలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తెలుగులో మాత్రం నేరుగా ఓటీటీలోకి వ‌స్తోంది.

ది అకాళి త‌మిళ వెర్ష‌న్ కూడా ఆహా ఓటీటీలోనే అందుబాటులో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ హార‌ర్ మూవీకి మ‌హ‌మ్మ‌ద్ ఆసీఫ్ హ‌మీద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీలో నాజ‌ర్‌తో పాటు త‌లైవాస‌ల్ విజ‌య్‌, జ‌య‌కుమార్ జాన‌కిరామ‌న్‌, వినోద్ కిష‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.

గ‌త ఏడాది మే నెల‌లో ది అకాలి త‌మిళ వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో రిలీజైంది.స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు సినిమాలోని ట్విస్ట్‌లు, హార‌ర్ ఎలిమెంట్స్‌, నాజ‌ర్ ప‌ర్ఫార్మెన్స్‌ బాగుం...