భారతదేశం, జనవరి 21 -- పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు 2026 ఆరంభం చేదు అనుభవాన్ని మిగిల్చింది. మారుతి దర్శకత్వంలో వింటేజ్ ప్రభాస్‌ను చూపిస్తారని ఆశించిన హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' (The Raja Saab) బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. జనవరి 9న భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. మొదటి రోజు రూ. 100 కోట్ల గ్రాస్ రాబట్టినప్పటికీ.. నెగెటివ్ టాక్ కారణంగా రెండో రోజు నుంచే కుప్పకూలిపోయింది.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ సినిమా బడ్జెట్ సుమారు రూ. 350 కోట్లు. విడుదలైన 11 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 203 కోట్ల గ్రాస్ (రూ. 141 కోట్ల నెట్) మాత్రమే వసూలు చేసింది. పన్నులు, ఇతర ఖర్చులు పోను డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ. 160 నుంచి 170 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక నష్టాలు...