భారతదేశం, ఏప్రిల్ 19 -- ఇటు టాలీవుడ్.. అటు బాలీవుడ్ లో వరుసగా స్పెషల్ సాంగ్స్ చేస్తూ.. అందచందాలతో కవ్విస్తున్న హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరో వివాదానికి కారణమైంది. కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడూ వార్తల్లో ఉండే ఈ భామ ఇప్పుడు తన పేరుతో గుడి ఉందనే సంచలన వ్యాఖ్యలు చేసింది. సౌత్ ఇండియాలో తనకు గుడి కడతారేమో అని కూడా కామెంట్ చేయడం గమనార్హం.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ''ఉత్తరాఖండ్ లో నా పేరు మీద గుడి ఉంది. బద్రినాథ్ కు వెళ్లేవాళ్లు ఎవరైనా ఆ పక్కనే ఉన్న నా గుడిని దర్శించొచ్చు. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ నా ఫొటోను పూలతో పూజిస్తారు. అది తెలిసి షాకయ్యా. కానీ నిజం'' అని ఊర్వశి పేర్కొంది.

ఉత్తరాఖండ్ లో గుడితో ఆగని ఊర్వశి సౌత్ ఇండియాలో ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడింది. టాలీవుడ...