భారతదేశం, ఆగస్టు 27 -- మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. కానీ, చాలామంది వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడే వాటి గురించి ఆలోచిస్తారు. అయితే, కొన్ని సాధారణ శ్వాస వ్యాయామాలతో మన ఊపిరితిత్తులను బలంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని చెబుతున్నారు వైద్య నిపుణులు.

గురుగ్రామ్‌లోని సీకే బిర్లా హాస్పిటల్స్‌కు చెందిన పల్మనాలజీ, క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ కులదీప్ కుమార్ గ్రోవర్ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, "శ్వాస వ్యాయామాలు మన శ్వాస వ్యవస్థను మెరుగుపరచడానికి, శరీరానికి ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని అద్భుతమైన స్థితిలో ఉంచడానికి సులువైన, ఖర్చు లేని మార్గాలు" అని వివరించారు. ఈ వ్యాయామాలను ఇంట్లోనే చేసుకోవచ్చని, వాటి వివరాలను కూడా ఆయన పంచుకున్నారు.

దీన్న...