Hyderabad, మే 8 -- కర్ణాటకలోని కొండ ప్రాంతం చిక్‌మగుళూరు. కాఫీ తోటలు, అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ప్రదేశం ఇది. ఇక్కడ పచ్చని లోయలు, జలపాతాలు, అభయారణ్యాలు నిండుగా ఉన్నాయి. సాహసాలు చేసేందుకు ఎన్నో క్రీడలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఈ కాఫీ భూమిని చూడాలంటే రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

చిక్‌మగుళూరు.. బెంగళూరు నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ఉత్తమ హిల్ స్టేషన్లలో ఇది ఒకటి. పచ్చదనం నిండి ఉన్న లోయలు, కొండలతో ఈ ప్రాంతం కనులు విందుగా ఉంటుంది.

దీన్ని కాఫీ భూమి అని పిలుచుకుంటారు. ఎందుకంటే చిక్‌మగుళూరు కాఫీ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో మొదట ఈ ప్రాంతంలోనే కాఫీని సాగు చేశారని కూడా చెబుతారు.

చిక్‌మగుళూరు ఎంతో ప్రసిద్ధమైనది. దీన్ని ఏడాది పొడవునా ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇక్కడ అధిక వేడి ఉం...