భారతదేశం, ఫిబ్రవరి 14 -- సిలబస్ పూర్తి కాలేదని, హాస్టల్ సౌకర్యాలు, ఇతర అంశాలపై రెండు రోజులుగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసింది. 'పోస్ట్ గ్రాడ్యుయేట్ మెుదటి సెమిస్టర్ పరీక్షలను తిరిగి షెడ్యూల్ చేసినట్లు సంబంధిత అందరికీ ఇందుమూలంగా తెలియజేస్తున్నాము. ఈ పరీక్షలు ఇప్పుడు మార్చి 2026 మొదటి వారం నుండి ప్రారంభమవుతాయి.' అని పరీక్షల కంట్రోలర్ విడుదల చేసిన నోటీసులో తెలిపారు.

సిలబస్‌లోని కొన్ని భాగాలు పూర్తి కాలేదని పేర్కొంటూ విద్యార్థులు గత రెండు రోజులుగా క్యాంపస్‌లో ఆందోళన చేస్తున్నారు. విశ్వవిద్యాలయ పరిపాలనా భవనం సమీపంలో నిరసనలు జరిగాయి. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

ఓయూ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ గురువారం విద్యార్థి ప్రతినిధులు, సంబంధిత విభ...