భారతదేశం, డిసెంబర్ 10 -- హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం(ఓయూ)లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసింది. ఉన్నత విద్యా శాఖ ద్వారా పరిపాలనా అనుమతి జారీ అయింది. ఉన్నత విద్యా శాఖ ఈ మొత్తానికి పరిపాలనా ఆమోదం తెలిపింది, ఈ నిధులు ఓయూ క్యాంపస్‌లో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగుదల కోసం మాత్రమే ఉద్దేశించినవని ప్రభుత్వం పేర్కొంది. మంజూరైన మొత్తాన్ని వినియోగించుకోవడానికి తదుపరి చర్యలు ప్రారంభించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వు జారీ అయ్యాయి.

యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వినియోగిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులు, అధ్యాపకుల సూచనలతో వర్సిటీ అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టును ఇప్పటికే అధికారులు రెడీ చేశారు. హాస్టళ...